Lord Rama

దాశరథీ శతకమ్

(Dasharathi Shatakam in Telugu)

Kancharla Gopanna (Bhakta Ramadasa)

Dasharathi Shatakam is a profound devotional work composed by Kancharla Gopanna, popularly known as Bhakta Ramadasa, during his imprisonment. Dedicated to Lord Rama of Bhadrachalam, the poem consists of 108 verses, each ending with the signature refrain addressing the Lord as the ocean of mercy. The verses express deep longing, surrender, and unwavering devotion, reflecting the poet's personal anguish and spiritual connection with the divine. Chanting these verses is believed to dissolve past sins, alleviate worldly suffering, and bestow the grace of Lord Rama, granting devotees inner peace and liberation from the cycle of rebirth.

శ్రీ రఘురామ చారుతుల-సీతాదలధామ శమక్షమాది శృం
గార గుణాభిరామ త్రిజ-గన్నుత శౌర్య రమాలలామ దు
ర్వార కబన్ధరాక్షస వి-రామ జగజ్జన కల్మషార్నవో
త్తారకనామ! భద్రగిరి-దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 1 ॥
రామవిశాల విక్రమ పరాజిత భార్గవరామ సద్గుణ
స్తోమ పరాఙ్గనావిముఖ సువ్రత కామ వినీల నీరద
శ్యామ కకుత్ధ్సవంశ కలశామ్భుధిసోమ సురారిదోర్భలో
ద్ధామ విరామ భద్రగిరి - దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 2 ॥
అగణిత సత్యభాష, శరణాగతపోష, దయాలసజ్ఘరీ
విగత సమస్తదోష, పృథివీసురతోష, త్రిలోక పూతకృ
ద్గగ నధునీమరన్ద పదకఞ్జ విశేష మణిప్రభా ధగ
ద్ధగిత విభూష భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 3 ॥
రఙ్గదరాతిభఙ్గ, ఖగ రాజతురఙ్గ, విపత్పరమ్పరో
త్తుఙ్గ తమఃపతఙ్గ, పరి తోషితరఙ్గ, దయాన్తరఙ్గ స
త్సఙ్గ ధరాత్మజా హృదయ సారసభృఙ్గ నిశాచరాబ్జమా
తఙ్గ, శుభాఙ్గ, భద్రగిరి దాశరథీ కరుణాపయోనిథీ. ॥ 4 ॥
శ్రీద సనన్దనాది మునిసేవిత పాద దిగన్తకీర్తిసం
పాద సమస్తభూత పరిపాల వినోద విషాద వల్లి కా
చ్ఛేద ధరాధినాథకుల సిన్ధుసుధామయపాద నృత్తగీ
తాది వినోద భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 5 ॥
ఆర్యుల కెల్ల మ్రొక్కివిన తాఙ్గుడనై రఘునాధ భట్టరా
రార్యుల కఞ్జలెత్తి కవి సత్తములన్ వినుతిఞ్చి కార్య సౌ
కర్య మెలర్పనొక్క శతకమ్బొన గూర్చి రచిన్తునేడుతా
త్పర్యమునన్ గ్రహిమ్పుమిది దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 6 ॥
మసకొని రేఙ్గుబణ్డ్లుకును మౌక్తికముల్ వెలవోసినట్లుదు
ర్వ్యసనముజెన్ది కావ్యము దురాత్ములకిచ్చితిమోస మయ్యె నా
రసనకుఁ బూతవృత్తిసుక రమ్బుగ జేకురునట్లు వాక్సుధా
రసములుచిల్క బద్యుముఖ రఙ్గమునన్దునటిమ్ప వయ్యసం
తసము జెన్ది భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 7 ॥
శ్రీరమణీయహార యతసీ కుసుమాభశరీర, భక్త మం
దార, వికారదూర, పరతత్త్వవిహార త్రిలోక చేతనో
దార, దురన్త పాతక వితాన విదూర, ఖరాది దైత్యకాం
తార కుఠార భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 8 ॥
దురితలతాలవిత్ర, ఖర దూషణకాననవీతిహొత్ర, భూ
భరణకలావిచిత్ర, భవ బన్ధవిమోచనసూత్ర, చారువి
స్ఫురదరవిన్దనేత్ర, ఘన పుణ్యచరిత్ర, వినీలభూరికం
ధరసమగాత్ర, భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 9 ॥
కనకవిశాలచేల భవకానన శాతకుఠారధార స
జ్జనపరిపాలశీల దివిజస్తుత సద్గుణ కాణ్డకాణ్డ సం
జనిత పరాక్రమక్రమ విశారద శారద కన్దకున్ద చం
దన ఘనసార సారయశ దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 10 ॥
శ్రీ రఘువంశ తోయధికి శీతమయూఖుడవైన నీ పవి
త్రోరుపదాబ్జముల్ వికసితోత్పల చమ్పక వృత్తమాధురీ
పూరితవాక్ప్రసూనముల బూజలొనర్చెద జిత్తగిమ్పుమీ
తారకనామ భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 11 ॥
గురుతరమైన కావ్యరస గుమ్భనకబ్బుర మన్దిముష్కరుల్
సరసులమాడ్కి సన్తసిల జూలుదురోటుశశాఙ్క చన్ద్రికాం
కురముల కిన్దు కాన్తమణి కోటిస్రవిఞ్చిన భఙ్గివిన్ధ్యభూ
ధరమున జాఱునే శిలలు దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 12 ॥
తరణికులేశ నానుడుల దప్పులు గల్గిన నీదునామ స
ద్విరచితమైన కావ్యము పవిత్రముగాదె వియన్నదీజలం
బరగుచువఙ్కయైన మలినాకృతి బాఱిన దన్మహత్వముం
దరమె గణిమ్ప నెవ్వరికి దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 13 ॥
దారుణపాత కాబ్ధికి సదా బడబాగ్ని భవాకులార్తివి
స్తారదవానలార్చికి సుధారసవృష్టి దురన్త దుర్మతా
చారభయఙ్క రాటవికి జణ్డకఠోరకుఠారధార నీ
తారకనామ మెన్నుకొన దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 14 ॥
హరునకు నవ్విభీషణునక ద్రిజకుం దిరుమన్త్ర రాజమై
కరికి సహల్యకుం ద్రుపదకన్యకు నార్తిహరిఞ్చుచుట్టమై
పరగినయట్టి నీపతిత పావననామము జిహ్వపై నిరం
తరము నటిమ్పజేయుమిక దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 15 ॥
ముప్పున గాలకిఙ్కరులు ముఙ్గిటవచ్చిన వేల, రోగముల్
గొప్పరమైనచో గఫము కుత్తుక నిణ్డినవేల, బాన్ధవుల్
గప్పినవేల, మీస్మరణ గల్గునొ గల్గదొ నాటి కిప్పుడే
తప్పకచేతు మీభజన దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 16 ॥
పరమదయానిధే పతితపావననామ హరే యటఞ్చు సు
స్ధిరమతులై సదాభజన సేయు మహాత్ముల పాదధూలి నా
శిరమునదాల్తుమీరటకు జేరకుడఞ్చు యముణ్డు కిఙ్కరో
త్కరముల కాన బెట్టునట దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 17 ॥
అజునకు తణ్డ్రివయ్యు సనకాదులకుం బరతత్త్వమయ్యుస
ద్ద్విజమునికోటికెల్లబర దేతవయ్యు దినేశవంశ భూ
భుజులకు మేటివయ్యుబరి పూర్ణుడవై వెలిగొన్దుపక్షిరా
డ్ధ్వజమిము బ్రస్తుతిఞ్చెదను దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 18 ॥
పణ్డిత రక్షకుం డఖిల పాపవిమొచను డబ్జసమ్భవా
ఖణ్డల పూజితుణ్డు దశకణ్ఠ విలుణ్ఠన చణ్డకాణ్డకో
దణ్డకలా ప్రవీణుడవు తావక కీర్తి వధూటి కిత్తుపూ
దణ్డలు గాగ నా కవిత దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 19 ॥
శ్రీరమ సీతగాగ నిజసేవక బృన్దము వీరవైష్ణవా
చార జవమ్బుగాగ విరజానది గౌతమిగా వికుణ్ఠ ము
న్నారయభద్ర శైలశిఖరాగ్రముగాగ వసిఞ్చు చేతనో
ద్ధారకుడైన విష్ణుడవు దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 20 ॥
కణ్టి నదీతటమ్బుబొడగణ్టిని భద్రనగాధివాసమున్
గణ్టి నిలాతనూజనురు కార్ముక మార్గణశఙ్ఖచక్రముల్
గణ్టిని మిమ్ము లక్ష్మణుని గణ్టి కృతార్ధుడ నైతి నో జగ
త్కణ్టక దైత్యనిర్ధలన దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 21 ॥
హలికునకున్ హలాగ్రమున నర్ధము సేకురుభఙ్గి దప్పిచే
నలమట జెన్దువానికి సురాపగలో జల మబ్బినట్లు దు
ర్మలిన మనోవికారియగు మర్త్యుని నన్నొడగూర్చి నీపయిన్
దలవు ఘటిమ్పజేసితివె దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 22 ॥
కొఞ్జకతర్క వాదమను గుద్దలిచే బరతత్త్వభూస్ధలిన్
రఞ్జిలద్రవ్వి కఙ్గొనని రామనిధానము నేడు భక్తిసి
ద్ధాఞ్జనమన్దుహస్తగత మయ్యెబలీ యనగా మదీయహృ
త్కఞ్జమునన్ వసిమ్పుమిక దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 23 ॥
రాముఁడు ఘోర పాతక విరాముడు సద్గుణకల్పవల్లికా
రాముడు షడ్వికారజయ రాముడు సాధుజనావనవ్రతో
ద్దాముఁడు రాముడే పరమ దైవము మాకని మీ యడుఙ్గు గెం
దామరలే భుజిఞ్చెదను దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 24 ॥
చక్కెరమానివేముదిన జాలినకైవడి మానవాధముల్
పెక్కురు ఒక్క దైవముల వేమఱుగొల్చెదరట్ల కాదయా
మ్రొక్కిననీకు మ్రొక్కవలె మోక్ష మొసఙ్గిన నీవయీవలెం
దక్కినమాట లేమిటికి దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 25 ॥
'రా' కలుషమ్బులెల్ల బయలమ్బడద్రోచిన 'మా'క వాటమై
డీకొనిప్రోవుచునిక్క మనిధీయుతులెన్నఁదదీయ వర్ణముల్
గైకొని భక్తి చే నుడువఁగానరు గాక విపత్పరమ్పరల్
దాకొనునే జగజ్జనుల దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 26 ॥
రామహరే కకుత్ధ్సకుల రామహరే రఘురామరామశ్రీ
రామహరేయటఞ్చు మది రఞ్జిల భేకగలమ్బులీల నీ
నామము సంస్మరిఞ్చిన జనమ్బు భవమ్బెడబాసి తత్పరం
ధామ నివాసులౌదురట దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 27 ॥
చక్కెర లప్పకున్ మిగుల జవ్వని కెఞ్జిగురాకు మోవికిం
జొక్కపుజుణ్టి తేనియకు జొక్కులుచుఙ్గన లేరు గాక నే
డక్కట రామనామమధు రామృతమానుటకణ్టె సౌఖ్యామా
తక్కినమాధురీ మహిమ దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 28 ॥
అణ్డజవాహ నిన్ను హృదయమ్బుననమ్మిన వారి పాపముల్
కొణ్డలవణ్టివైన వెసగూలి నశిమ్పక యున్నె సన్త తా
ఖణ్డలవైభవోన్నతులు గల్గకమానునె మోక్ష లక్ష్మికై
దణ్డయొసఙ్గకున్నె తుద దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 29 ॥
చిక్కనిపాలపై మిసిమి జెన్దిన మీగడ పఞ్చదారతో
మెక్కినభఙ్గి మీవిమల మేచకరూప సుధారసమ్బు నా
మక్కువ పల్లేరమ్బున సమాహిత దాస్యము నేటిదో యిటన్
దక్కెనటఞ్చు జుర్రెదను దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 30 ॥
సిరులిడసీత పీడలెగ జిమ్ముటకున్ హనుమన్తుడార్తిసో
దరుడు సుమిత్రసూతి దురితమ్బులుమానుప రామ నామముం
గరుణదలిర్ప మానవులగావగ బన్నిన వజ్రపఞ్జరో
త్కరముగదా భవన్మహిమ దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 31 ॥
హలికులిశాఙ్కుశధ్వజ శరాసన శఙ్ఖరథాఙ్గ కల్పకో
జ్వలజలజాత రేఖలను సాంశములై కనుపట్టుచున్న మీ
కలితపదామ్బుజ ద్వయము గౌతమపత్ని కొసఙ్గినట్లు నా
తలపున జేర్చికావగదె దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 32 ॥
జలనిధిలోనదూఱి కుల శైలముమీటి ధరిత్రిగొమ్మునం
దలవడమాటిరక్కసుని యఙ్గముగీటిబలీన్ద్రునిన్ రసా
తలమునమాటి పార్ధివక దమ్బముగూఱ్చిన మేటిరామ నా
తలపుననాటి రాగదవె దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 33 ॥
భణ్డన భీముడా ర్తజన బాన్ధవుడుజ్జ్వల బాణతూణకో
దణ్డకలాప్రచణ్డ భుజ తాణ్డవకీర్తికి రామమూర్తికిన్
రెణ్డవ సాటిదైవమిక లేడనుచున్ గడగట్టి భేరికా
డాణ్డ డడాణ్డ డాణ్డ నినదమ్బు లజాణ్డమునిణ్డ మత్తవే
దణ్డము నెక్కి చాటెదను దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 34 ॥
అవనిజ కన్నుదోయి తొగలన్దు వెలిఙ్గెడు సోమ, జానకీ
కువలయనేత్ర గబ్బిచనుకొణ్డల నుణ్డు ఘనమ్బ మైధిలీ
నవనవ యౌవనమ్బను వనమ్బుకున్ మదదన్తి వీవెకా
దవిలి భజిన్తు నెల్లపుడు దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 35 ॥
ఖరకరవంశజా విను ముఖణ్డిత భూతపిశాచఢాకినీ
జ్వర పరితాపసర్పభయ వారకమైన భవత్పదాబ్జ ని
స్పుర దురువజ్రపఞ్జరముజొచ్చితి, నీయెడ దీన మానవో
ధ్ధర బిరుదఙ్క మేమఱుకు దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 36 ॥
జుర్రెదమీక థామృతము జుర్రెదమీపదకఞ్జతో యమున్
జుర్రెద రామనామమున జొబ్బిలుచున్న సుధారసమ్బ నే
జుర్రెద జుర్రుజుర్రుఁగ రుచుల్ గనువారిపదమ్బు గూర్పవే
తుర్రులతోడి పొత్తిడక దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 37 ॥
ఘోరకృతాన్త వీరభట కోటికి గుణ్డెదిగుల్ దరిద్రతా
కారపిశాచ సంహరణ కార్యవినోది వికుణ్ఠ మన్దిర
ద్వార కవాట భేది నిజదాస జనావలికెల్ల ప్రొద్దు నీ
తారకనామ మెన్నుకొన దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 38 ॥
విన్నపమాలకిఞ్చు రఘువీర నహిప్రతిలోకమన్దు నా
కన్నదురాత్ముడుం బరమ కారుణికోత్తమ వేల్పులన్దు నీ
కన్న మహాత్ముడుం బతిత కల్మషదూరుడు లేడునాకువి
ద్వన్నుత నీవెనాకు గతి దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 39 ॥
పెమ్పునఁదల్లివై కలుష బృన్దసమాగమ మొన్దుకుణ్డు ర
క్షిమ్పనుదణ్డ్రివై మెయు వసిఞ్చుదు శేన్ద్రియ రోగముల్ నివా
రిమ్పను వెజ్జవై కృప గుఱిఞ్చి పరమ్బు దిరబుగాఁగ స
త్సమ్పదలీయ నీవెగతి దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 40 ॥
కుక్షినజాణ్డపం క్తులొన గూర్చి చరాచరజన్తుకోటి సం
రక్షణసేయు తణ్డ్రివి పరమ్పర నీ తనయుణ్డనైన నా
పక్షము నీవుగావలదె పాపము లెన్ని యొనర్చినన్ జగ
ద్రక్షక కర్తవీవెకద దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 41 ॥
గద్దరియో గిహృత్కమల గన్ధర సానుభవమ్బుఁజెన్దు పె
న్నిద్దవు గణ్డుఁ దేఁటి థరణీసుత కౌఁగిలిపఞ్జరమ్బునన్
ముద్దులుగుల్కు రాచిలుక ముక్తినిధానమురామరాఁగదే
తద్దయు నేఁడు నాకడకు దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 42 ॥
కలియుగ మర్త్యకోటినిను గఙ్గొన రానివిధమ్బో భక్తవ
త్సలతవహిమ్పవో చటుల సాన్ద్రవిపద్దశ వార్ధి గ్రుఙ్కుచో
బిలిచిన బల్క విన్తమఱపీ నరులిట్లనరాదు గాక నీ
తలపున లేదె సీత చెఱ దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 43 ॥
జనవర మీక థాలి వినసైఁపక కర్ణములన్దు ఘణ్టికా
నినద వినోదముల్ సులుపునీచునకున్ వరమిచ్చినావు ని
న్ననయమునమ్మి కొల్చిన మహాత్మునకేమి యొసఙ్గు దోసనం
దననుత మాకొసఙ్గుమయ దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 44 ॥
పాపము లొన్దువేల రణపన్నగ భూత భయజ్వారాదులన్
దాపద నొన్దువేల భరతాగ్రజ మిమ్ము భజిఞ్చువారికిన్
బ్రాపుగ నీవుదమ్ము డిరుపక్కియలన్ జని తద్విత్తి సం
తాపము మామ్పి కాతురట దాశరథీ కరుణాపయోనిధి. ॥ 45 ॥
అగణిత జన్మకర్మదురి తామ్బుధిలో బహుదుఃఖవీచికల్
దెగిపడవీడలేక జగతీధర నీపదభక్తి నావచే
దగిలి తరిమ్పగోరితి బదమ్పబడి నదు భయమ్భు మామ్పవే
తగదని చిత్తమం దిడక దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 46 ॥
నేనొనరిఞ్చు పాపముల నేకములైనను నాదుజిహ్వకుం
బానకమయ్యెమీపరమ పావననామముదొణ్టి చిల్కరా
మాననుగావుమన్న తుది మాటకు సద్గతి జెన్దెగావునన్
దాని ధరిమ్పగోరెదను దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 47 ॥
పరధనముల్ హరిఞ్చి పరభామలనణ్టి పరాన్న మబ్బినన్
మురిపమ కానిమీఁదనగు మోసమెఱుఙ్గదు మానసమ్బు
స్తరమదికాలకిఙ్కర గదాహతి పాల్పడనీక మమ్ము నేదు
తఱిదరిజేర్చి కాచెదవొ దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 48 ॥
చేసితి ఘోరకృత్యములు చేసితి భాగవతాపచారముల్
చేసితి నన్యదైవములఁ జేరి భజిఞ్చిన వారిపొన్దు నేఁ
జేసిన నేరముల్ దలఁచి చిక్కులఁబెట్టకుమయ్యయయ్య నీ
దాసుఁడనయ్య భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 49 ॥
పరుల ధనమ్బుఁజూచిపర భామలజూచి హరిమ్పగోరు మ
ద్గురుతరమానసం బనెడు దొఙ్గనుబట్టినిరూఢదాస్య వి
స్ఫురితవివేక పాశములఁ జుట్టి భవచ్చరణమ్బనే మరు
త్తరువునగట్టివేయగ దె దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 50 ॥
సలలిత రామనామ జపసార మెఱుఙ్గను గాశికాపురీ
నిలయుడగానుమీచరణ నీరజరేణు మహాప్రభావముం
దెలియనహల్యగాను జగతీవర నీదగు సత్యవాక్యముం
దలపగ రావణాసురుని తమ్ముడగాను భవద్విలాసముల్
దలచినుతిమ్ప నాతరమె దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 51 ॥
పాతకులైన మీకృపకు బాత్రులు కారెతలఞ్చిచూడ జ
ట్రాతికిగల్గె బావన మరాతికి రాజ్యసుఖమ్బుగల్గె దు
ర్జాతికి బుణ్యమబ్బెగపి జాతిమహత్త్వమునొన్దెగావునం
దాతవ యెట్టివారలకు దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 52 ॥
మామక పాతక వజ్రము మ్రామ్పనగణ్యము చిత్రగుప్తులే
యేమని వ్రాతురో? శమనుడేమి విధిఞ్చునొ? కాలకిఙ్కర
స్తోమ మొనర్చిటేమొ? వినజొప్పడ దిన్తకమున్నెదీనచిం
తామణి యొట్లు గాచెదవొ దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 53 ॥
దాసిన చుట్టూమా శబరి? దాని దయామతి నేలినావు; నీ
దాసుని దాసుడా? గుహుడు తావకదాస్య మొసఙ్గినావు నే
జేసిన పాపమో! వినుతి చేసినగావవు గావుమయ్య! నీ
దాసులలోన నేనొకఁడ దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 54 ॥
దీక్షవహిఞ్చి నాకొలది దీనుల నెన్దఱి గాచితో జగ
ద్రక్షక తొల్లియా ద్రుపద రాజతనూజ తలఞ్చినన్తనే
యక్షయమైన వల్వలిడి తక్కట నామొఱజిత్తగిఞ్చి
ప్రత్యక్షము గావవేమిటికి దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 55 ॥
నీలఘనాభమూర్తివగు నిన్ను గనుఙ్గొనికోరి వేడినన్
జాలముసేసి డాగెదవు సంస్తుతి కెక్కిన రామనామ మే
మూలను దాచుకోగలవు ముక్తికి బ్రాపది పాపమూలకు
ద్దాలముగాదె మాయెడల దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 56 ॥
వలదు పరాకు భక్తజనవత్సల నీ చరితమ్బు వమ్ముగా
వలదు పరాకు నీబిరుదు వజ్రమువణ్టిది గాన కూరకే
వలదు పరాకు నాదురిత వార్ధికి దెప్పవుగా మనమ్బులో
దలతుమెకా నిరన్తరము దాశరథీ కరునాపయోనిధీ. ॥ 57 ॥
తప్పులెఱుఙ్గ లేక దురితమ్బులు సేసితినణ్టి నీవుమా
యప్పవుగావు మణ్టి నికనన్యులకున్ నుదురణ్టనణ్టినీ
కొప్పిదమైన దాసజను లొప్పిన బణ్టుకు బటవణ్టి నా
తప్పుల కెల్ల నీవెగతి దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 58 ॥
ఇతడు దురాత్ముడఞ్చుజను లెన్నఁగ నాఱడిఁగొణ్టినేనెపో
పతితుఁడ నణ్టినో పతిత పావనమూర్తివి నీవుగల్ల నే
నితిరుల వేఁడనణ్టి నిహ మిచ్చిననిమ్ముపరమ్బొసఙ్గుమీ
యతులిత రామనామ మధు రాక్షర పాలినిరన్తరం బహృ
ద్గతమని నమ్మికొల్చెదను దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 59 ॥
అఞ్చితమైననీదు కరుణామృతసారము నాదుపైని బ్రో
క్షిఞ్చిన జాలుదాననిర సిఞ్చెదనాదురితమ్బు లెల్లదూ
లిఞ్చెద వైరివర్గ మెడలిఞ్చెద గోర్కులనీదుబణ్టనై
దఞ్చెద, గాలకిఙ్కరుల దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 60 ॥
జలనిధు లేడునొక్క మొగిఁ జక్కికిదెచ్చెశరమ్బు, ఱాతినిం
పలరఁగ జేసెనాతిగఁబ దాబ్జపరాగము, నీ చరిత్రముం
జలజభవాది నిర్జరులు సన్నుతి సేయఁగ లేరు గావునం
దలపనగణ్యమయ్య యిది దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 61 ॥
కోతికిశక్యమా యసురకోటుల గెల్వను గాల్చెబో నిజం
బాతనిమేన శీతకరుడౌట దవానలు డెట్టివిన్త? మా
సీతపతివ్రతా మహిమసేవకు భాగ్యముమీకటాక్షము
ధాతకు శక్యమా పొగడ దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 62 ॥
భూపలలామ రామరఘుపుఙ్గవరామ త్రిలోక రాజ్య సం
స్ధాపనరామ మోక్షఫల దాయక రామ మదీయ పాపముల్
పాపగదయ్యరామ నిను బ్రస్తుతి చేసెదనయ్యరామ సీ
తాపతిరామ భద్రగిరి దాసరథీ కరుణాపయోనిధీ. ॥ 63 ॥
నీసహజమ్బు సాత్వికము నీవిడిపట్టు సుధాపయోధి, ప
ద్మాసనుడాత్మజుణ్డు, గమలాలయనీ ప్రియురాలు నీకు సిం
హాసనమిద్ధరిత్రి; గొడుగాక సమక్షులు చన్ద్రబాస్కరుల్
నీసుమతల్పమాదిఫణి నీవె సమస్తము గొల్చినట్టి నీ
దాసుల భాగ్యమెట్టిదయ దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 64 ॥
చరణము సోకినట్టి శిలజవ్వనిరూపగు టొక్కవిన్త, సు
స్ధిరముగ నీటిపై గిరులు దేలిన దొక్కటి విన్తగాని మీ
స్మరణ దనర్చుమానవులు సద్గతి జెన్దిన దెన్తవిన్త? యీ
ధరను ధరాత్మజారమణ దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 65 ॥
దైవము తల్లిదణ్డ్రితగు దాత గురుణ్డు సఖుణ్డు నిన్నె కా
భావన సేయుచున్నతఱి పాపములెల్ల మనోవికార దు
ర్భావితుజేయుచున్నవికృపామతివైనను కావుమీ జగ
త్పావనమూర్తి భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 66 ॥
వాసవ రాజ్యభోగ సుఖ వార్ధిని దేలు ప్రభుత్వమబ్బినా
యాసకుమేర లేదు కనకాద్రిసమాన ధనమ్బుగూర్చినం
గాసును వెణ్టరాదు కని కానక చేసిన పుణ్యపాపముల్
వీసరబోవ నీవు పదివేలకు జాలు భవమ్బునొల్ల నీ
దాసునిగాగ నేలుకొను దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 67 ॥
సూరిజనుల్ దయాపరులు సూనృతవాదు లలుబ్ధమానవుల్
వేరపతిప్రతాఙ్గనలు విప్రులు గోవులు వేదముల్ మహా
భారముదాల్పగా జనులు పావనమైన పరోపకార స
త్కార మెఱుఙ్గులే రకట దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 68 ॥
వారిచరావతారము వారిధిలో జొఱబాఱి క్రోధ వి
స్తారగుడైన యా నిగమతస్కరవీర నిశాచరేన్ద్రునిం
జేరి వధిఞ్చి వేదముల చిక్కెడలిఞ్చి విరిఞ్చికి మహో
దారతనిచ్చితీవెగద దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 69 ॥
కరమనుర క్తిమన్దరము గవ్వముగా నహిరాజుద్రాడుగా
దొరకొన దేవదానవులు దుగ్ధపయోధిమథిఞ్చుచున్నచో
ధరణిచలిమ్పలోకములు తల్లడమన్దగ గూర్మమై ధరా
ధరము ధరిఞ్చితీవెకద దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 70 ॥
ధారుణి జాపజుట్టిన విధమ్బునగైకొని హేమనేత్రుడ
వ్వారిధిలోనదాగినను వానివధిఞ్చి వరాహమూర్తివై
ధారుణిదొణ్టికై వడిని దక్షిణశృఙ్గమున ధరిఞ్చి వి
స్తార మొనర్చితీవే కద దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 71 ॥
పెటపెటనుక్కు కమ్బమున భీకరదన్త నఖాన్తర ప్రభా
పటలము గప్ప నుప్పతిలి భణ్డనవీధి నృసింహభీకర
స్ఫుటపటుశక్తి హేమకశిపు విదలిఞ్చి సురారిపట్టి నం
తటగృపజూచితీవెకద దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 72 ॥
పదయుగలమ్బు భూగగన భాగముల వెసనూని విక్రమా
స్పదమగునబ్బలీన్ద్రునొక పాదమునన్దల క్రిన్దనొత్తిమే
లొదవజగత్త్రయమ్బు బురు హూతునికియ్యవటుణ్డవైనచి
త్సదమలమూర్తి వీవెకద దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 73 ॥
ఇరువదియొక్కమాఱు ధరణీశుల నెల్లవధిఞ్చి తత్కలే
బర రుధిర ప్రవాహమున బైతృకతర్పణ మొప్పజేసి భూ
సురవరకోటికి ముదము సొప్పడ భార్గవరామమూర్తివై
ధరణినొసఙ్గితీ వెకద దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 74 ॥
దురమున దాటకన్దునిమి ధూర్జటివిల్ దునుమాడిసీతనుం
బరిణయమన్ది తణ్డ్రిపనుప ఘన కాననభూమి కేగి దు
స్తరపటుచణ్డ కాణ్డకులిశాహతి రావణకుమ్భకర్ణ భూ
ధరముల గూల్చితీ వెకద దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 75 ॥
అనుపమయాదవాన్వయసు ధాబ్ధిసుధానిధి కృష్ణమూర్తినీ
కనుజుడుగాజనిఞ్చి కుజనావలినెల్ల నడఞ్చి రోహిణీ
తనయుడనఙ్గ బాహుబల దర్పమున బలరామ మూర్తివై
తనరిన వేల్పవీవెకద దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 76 ॥
సురలునుతిమ్పగా ద్రిపుర సున్దరుల వరియిమ్పబుద్ధరూ
పరయగ దాల్చితీవు త్రిపురాసురకోటి దహిఞ్చునప్పుడా
హరునకుదోడుగా వరశ రాసన బాణముఖో గ్రసాధనో
త్కర మొనరిఞ్చితీవుకద దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 77 ॥
సఙ్కరదుర్గమై దురిత సఙ్కులమైన జగమ్బుజూచి స
ర్వఙ్కషలీల ను త్తమ తురఙ్గమునెక్కి కరాసిబూని వీ
రాఙ్కవిలాస మొప్ప గలి కాకృత సజ్జనకోటికి నిరా
తఙ్క మొనర్చితీవుకద దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 78 ॥
మనముననూహపోషణలు మర్వకమున్నె కఫాదిరోగముల్
దనువుననణ్టి మేనిబిగి దప్పకమున్నెనరుణ్డు మోక్ష సా
ధన మొనరిమ్పఁగావలయుఁ దత్త్వవిచారము మానియుణ్డుట
ల్తనువునకు విరోధమిది దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 79 ॥
ముదమున కాటపట్టుభవ మోహమద్వ దిరదాఙ్కుశమ్బు సం
పదల కొటారు కోరికల పణ్ట పరమ్బున కాది వైరుల
న్నదన జయిఞ్చుత్రోవ విపదబ్ధికినావగదా సదాభవ
త్సదమలనామసంస్మరణ దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 80 ॥
దురిత లతానుసార భయ దుఃఖ కదమ్బము రామనామభీ
కరతల హేతిచేఁ దెగి వకావకలై చనకుణ్డ నేర్చునే
దరికొని మణ్డుచుణ్డు శిఖ దార్కొనిన శలబాదికీటకో
త్కరము విలీనమైచనవె దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 81 ॥
హరిపదభక్తినిన్ద్రియజ యాన్వితుడుత్తముఁడిన్ద్రిమమ్బులన్
మరుగక నిల్పనూదినను మధ్యముఁడిన్ద్రియపారశ్యుడై
పరగినచో నికృష్టుడని పల్కగ దుర్మతినైన నన్ను నా
దరమున నెట్లుకాచెదవొ దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 82 ॥
వనకరిచిక్కు మైనసకు పాచవికిం జెడిపోయె మీనుతా
వినికికిఁజిక్కెఁజిల్వగను వేఁదుఱుఁ జెన్దెను లేల్లు తావిలో
మనికినశిఞ్చె దేటితర మాయిరుమూఁటిని గెల్వనై దుసా
ధనములనీ వె కావనగు దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 83 ॥
కరములుమీకుమ్రొక్కులిడ కన్నులు మిమ్మునె చూడ జిహ్వ మీ
స్మరణదనర్పవీనులుభ వత్కథలన్ వినుచుణ్డనాస మీ
యఱుతును బెట్టుపూసరుల కాసగొనం బరమార్థ సాధనో
త్కరమిది చేయవేకృపను దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 84 ॥
చిరతరభక్తి నొక్కతులసీదల మర్పణ చేయువాడు ఖే
చరగరు డోరగ ప్రముఖ సఙ్ఘములో వెలుగన్ సధా భవత్
సురుచిర ధీన్ద పాదముల బూజలొనర్చిన వారికెల్లద
త్పర మరచేతిధాత్రిగద దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 85 ॥
భానుడు తూర్పునన్దుగను పుట్టినఁ బావక చన్ద్ర తేజముల్
హీనత జెన్దినట్లు జగదేక విరాజితమైన నీ పద
ధ్యానము చేయుచున్నఁ బర దైవమరీచులడఙ్గకుణ్డు నే
దానవ గర్వ నిర్దలన దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 86 ॥
నీమహనీయతత్త్వ రస నిర్ణ యబోధ కథామృతాబ్ధిలో
దామునుగ్రుఙ్కులాడకవృ థాతనుకష్టముజెన్ది మానవుం
డీ మహిలోకతీర్థముల నెల్ల మునిఙ్గిన దుర్వికార హృ
తామసపఙ్కముల్ విదునె దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 87 ॥
నీమహనీయతత్త్వ రస నిర్ణ యబోధ కథామృతాబ్ధిలో
దామునుగ్రుఙ్కులాడకవృ థాతనుకష్టముజెన్ది మానవుం
డీ మహిలోకతీర్థముల నెల్ల మునిఙ్గిన దుర్వికార హృ
తామసపఙ్కముల్ విదునె దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 88 ॥
కాఞ్చన వస్తుసఙ్కలిత కల్మష మగ్ని పుటమ్బు బెట్టెవా
రిఞ్చినరీతి నాత్మనిగిడిఞ్చిన దుష్కర దుర్మలత్రయం
బఞ్చిత భ క్తియోగ దహ నార్చిఁదగుల్పక పాయునే కన
త్కాఞ్చనకుణ్డలాభరణ దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 89 ॥
నీసతి పెక్కు గల్ములిడనేర్పిరి, లోక మకల్మషమ్బుగా
నీసుత సేయు పావనము నిర్మిత కార్యధురీణ దక్షుడై
నీసుతుడిచ్చు నాయువులు నిన్న భుజిఞ్చినఁ గల్గకుణ్డునే
దాసులకీప్సి తార్థముల దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 90 ॥
వారిజపత్రమన్దిడిన వారివిధమ్బున వర్తనీయమం
దారయ రొమ్పిలోన దను వణ్టని కుమ్మరపుర్వురీతి సం
సారమున మెలఙ్గుచు విచారడైపరమొన్దుగాదెస
త్కార మెఱిఙ్గి మానవుడు దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 91 ॥
ఎక్కడి తల్లిదణ్డ్రి సుతులెక్కడి వారు కలత్ర బాన్ధవం
బెక్కడ జీవుఁడెట్టి తను వెత్తిన బుట్టును బోవుచున్న వా
డొక్కడెపాప పుణయ ఫల మొన్దిన నొక్కడె కానరాడువే
ఱొక్కడు వెణ్టనణ్టిభవ మొల్లనయాకృప జూడువయ్యనీ
టక్కరి మాయలన్దిడక దాశరథీ కరుణా పయోనిధీ. ॥ 92 ॥
దొరసినకాయముల్ముదిమి తోచినఁజూచిప్రభుత్వముల్సిరు
ల్మెఱపులుగాగజూచిమఱి మేదినిలోఁదమతోడివారుముం
దరుగుటజూచిచూచి తెగు నాయువెఱుఙ్గక మోహపాశము
లరుగనివారికేమిగతి దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 93 ॥
సిరిగలనాఁడు మైమఱచి చిక్కిననాఁడుదలఞ్చి పుణ్యముల్
పొరిఁబొరి సేయనైతినని పొక్కినఁ గల్గు నెగాలిచిచ్చుపైఁ
గెరలిన వేలఁదప్పికొని కీడ్పడు వేల జలమ్బు గోరి త
త్తరమునఁ ద్రవ్వినం గలదె దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 94 ॥
జీవనమిఙ్కఁ బఙ్కమున జిక్కిన మీను చలిమ్పకెన్తయు
దావుననిల్చి జీవనమె దద్దయుఁ గోరువిధమ్బు చొప్పడం
దావలమైనఁగాని గుఱి తప్పనివాఁడు తరిఞ్చువాఁడయా
తావకభక్తియో గమున దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 95 ॥
సరసునిమానసమ్బు సర సజ్ఞుడెరుఙ్గును ముష్కరాధముం
డెఱిఁగిగ్రహిఞ్చువాడె కొల నేకనిసముఁ గాగదుర్దురం
బరయఁగ నేర్చునెట్లు విక చాబ్దమరన్ద రసైక సౌరభో
త్కరముమిలిన్ద మొన్దుక్రియ దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 96 ॥
నోఁచినతల్లిదణ్డ్రికిఁ దనూభవుఁడొక్కడెచాలు మేటిచే
చాఁచనివాడు వేఱొకఁడు చాచిన లేదన కిచ్చువాఁడునో
రాఁచినిజమ్బకాని పలు కాడనివాఁడు రణమ్బులోన మేన్
దాచనివాఁడు భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 97 ॥
శ్రీయుతజానకీరమణ చిన్నయరూప రమేశరామ నా
రాయణ పాహిపాహియని బ్రస్తుతిఁ జేసితి నామనమ్బునం
బాయక కిల్బిషవ్రజ వి పాటనమన్దఁగ జేసి సత్కలా
దాయి ఫలమ్బునాకియవె దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 98 ॥
ఎన్తటిపుణ్యమో శబరి యెఙ్గిలిగొణ్టివి విన్తగాదె నీ
మన్తన మెట్టిదో యుడుత మైనిక రాగ్ర నఖాఙ్కురమ్బులన్
సన్తసమన్దఁ జేసితివి సత్కులజన్మము లేమి లెక్క వే
దాన్తముగాదె నీ మహిమ దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 99 ॥
బొఙ్కనివాఁడెయోగ్యుడరి బృన్దము లెత్తిన చోటజివ్వకుం
జఙ్కనివాఁడెజోదు రభసమ్బున నర్థి కరమ్బుసాఁచినం
గొఙ్కనివాఁడెదాత మిముఁ గొల్చిభజిఞ్చిన వాఁడె పోనిరా
తఙ్క మనస్కుఁ డెన్న గను దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 100 ॥
భ్రమరముగీటకమ్బుఁ గొని పాల్పడి ఝాఙ్కరణో కారియై
భ్రమరముగానొనర్చునని పల్కుటఁ జేసి భవాది దుఃఖసం
తమసమెడల్చి భక్తిసహి తమ్బుగ జీవుని విశ్వరూప త
త్త్వమునధరిఞ్చు టేమరుదు దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 101 ॥
తరువులు పూచికాయలగు దక్కుసుమమ్బులు పూజగాభవ
చ్చరణము సోకిదాసులకు సారములో ధనధాన్యరాశులై
కరిభట ఘోటకామ్బర నకాయములై విరజా సము
త్తరణ మొనర్చుజిత్రమిది దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 102 ॥
పట్టితిభట్టరార్యగురు పాదములిమ్మెయినూర్ధ్వ పుణ్డ్రముల్
వెట్టితిమన్త్రరాజ మొడి బెట్టితి నయ్యమకిఙ్క రాలికిం
గట్టితిబొమ్మమీచరణ కఞ్జలన్దుఁ దలమ్పుపెట్టి బో
దట్టితిఁ బాపపుఞ్జముల దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 103 ॥
అల్లన లిఙ్గమన్త్రి సుతుడత్రిజ గోత్రజుడాదిశాఖ కం
చెర్ల కులోద్బవుం దమ్బ్రసిద్ధిడనై భవదఙ్కితమ్బుగా
నెల్లకవుల్ నుతిమ్ప రచియిఞ్చితి గోపకవీన్ద్రుడన్ జగ
ద్వల్లభ నీకు దాసుడను దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 104 ॥

Explore More