Sai Baba of Shirdi

శ్రీ శిర్డీ సాఈ చలీసా

(Shri Shirdi Sai Chalisa in Telugu)

Traditional

The Shirdi Sai Chalisa is a reverent devotional composition dedicated to Shirdi Sai Baba, revered by his devotees as an incarnation of Dattatreya and the Trimurti. Composed in Telugu, this stotra celebrates his ascetic life, his teachings of sacrifice and patience, and his role as a spiritual guide residing in the hearts of his followers. Chanting this Chalisa serves as a meditative practice to seek the blessings of the Sadguru, find inner peace, overcome worldly obstacles, and attain spiritual liberation. It emphasizes the profound connection between the devotee and the divine presence of Sai Baba.

శిరిడీవాసా సాఈప్రభో జగతికి మూలం నీవే ప్రభో
దత్త దిగమ్బర అవతారం నీలో సృష్టి వ్యవహారమ్ ॥
త్రిమూర్తిరూపా ఓ సాఈ కరుణిఞ్చి కాపాడోయి
దర్శనమియ్య గరావయ్య ముక్తికి మార్గం చూపుమయా ॥ 1 ॥
శిరిడీవాసా సాఈప్రభో ॥
కఫిని వస్త్రము ధరియిఞ్చి భుజముకు జోలీ తగిలిఞ్చి
నిమ్బ వృక్షపు ఛాయలో ఫకీరు వేషపు ధారణలో
కలియుగమన్దున వెలసితివి త్యాగం సహనం నేర్పితివి
శిరిడీ గ్రామం నీ వాసం భక్తుల మదిలో నీ రూపమ్ ॥ 2 ॥
శిరిడీవాసా సాఈప్రభో ॥
చాన్ద్ పాటిల్ ను కలుసుకుని ఆతని బాధలు తెలుసుకుని
గుర్రము జాడ తెలిపితివి పాటిల్ బాధను తీర్చితివి
వెలిగిఞ్చావు జ్యోతులను నీవుపయోగిఞ్చి జలములను
అచ్చెరువొన్దెను ఆ గ్రామం చూసి విన్తైన ఆ దృశ్యమ్ ॥ 3 ॥
శిరిడీవాసా సాఈప్రభో ॥
బాయిజా చేసెను నీ సేవ ప్రతిఫలమిచ్చావో దేవా
నీ ఆయువును బదులిచ్చి తాత్యాను నీవు బ్రతికిఞ్చి
పశుపక్షులను ప్రేమిఞ్చి ప్రేమతో వాటిని లాలిఞ్చి
జీవులపైన మమకారం చిత్రమయా నీ వ్యవహారమ్ ॥ 4 ॥
శిరిడీవాసా సాఈప్రభో ॥
నీ ద్వారములో నిలిచితిని నిన్నే నిత్యము కొలిచితిని
అభయమునిచ్చి బ్రోవుమయా ఓ శిరిడీశా దయామయా
ధన్యము ద్వారక ఓ మాయీ నీలో నిలిచెను శ్రీసాఈ
నీ ధుని మణ్టల వేడిమికి పాపము పోవును తాకిడికి ॥ 5 ॥
శిరిడీవాసా సాఈప్రభో ॥
ప్రలయ కాలము ఆపితివి భక్తులను నీవు బ్రోచితివి
చేసి మహమ్మారీ నాశం కాపాడి శిరిడీ గ్రామం
అగ్నిహోత్రి శాస్త్రికి లీలా మహాత్మ్యం చూపిఞ్చి
శ్యామాను బ్రతికిఞ్చితివి పాము విషము తొలిగిఞ్చి ॥ 6 ॥
శిరిడీవాసా సాఈప్రభో ॥
భక్త భీమాజీకి క్షయరోగం నశియిఞ్చే ఆతని సహనం
ఊదీ వైద్యం చేసావు వ్యాధిని మాయం చేసావు
కాకాజీకి ఓ సాఈ విఠల దర్శన మిచ్చితివి
దామూకిచ్చి సన్తానం కలిగిఞ్చితివి సన్తోషమ్ ॥ 7 ॥
శిరిడీవాసా సాఈప్రభో ॥
కరుణాసిన్ధూ కరుణిఞ్చు మాపై కరుణ కురిపిఞ్చు
సర్వం నీకే అర్పితము పెఞ్చుము భక్తి భావమును
ముస్లిం అనుకొని నిను మేఘూ తెలుసుకుని ఆతని బాధ
దాల్చి శివశఙ్కర రూపం ఇచ్చావయ్యా దర్శనము ॥ 8 ॥
శిరిడీవాసా సాఈప్రభో ॥
డాక్టరుకు నీవు రామునిగా బల్వన్తకు శ్రీదత్తునిగా
నిమోనుకరకు మారుతిగా చిదమ్బరకు శ్రీగణపతిగా
మార్తాణ్డకు ఖణ్డోబాగా గణూకు సత్యదేవునిగా
నరసింహస్వామిగా జోషికి దర్శనము నిచ్చిన శ్రీసాఈ ॥ 9 ॥
శిరిడీవాసా సాఈప్రభో ॥
రేయి పగలు నీ ధ్యానం నిత్యం నీ లీలా పఠనం
భక్తితో చేయణ్డి ధ్యానం లభిఞ్చును ముక్తికి మార్గం
పదకొణ్డు నీ వచనాలు బాబా మాకవి వేదాలు
శరణని వచ్చిన భక్తులను కరుణిఞ్చి నీవు బ్రోచితివి ॥ 10 ॥
శిరిడీవాసా సాఈప్రభో ॥
అన్దరిలోన నీ రూపం నీ మహిమ అతి శక్తిమయం
ఓ సాఈ మేము మూఢులము ఒసగుమయా మాకు జ్ఞానమును
సృష్టికి నీవేనయ మూలం సాఈ మేము సేవకులం
సాఈ నామము తలచెదము నిత్యము సాఈని కొలిచెదము ॥ 11 ॥
శిరిడీవాసా సాఈప్రభో ॥
భక్తి భావన తెలుసుకొని సాఈని మదిలో నిలుపుకొని
చిత్తముతో సాఈ ధ్యానం చేయణ్డి ప్రతినిత్యం
బాబా కాల్చిన ధుని ఊది నివారిఞ్చును అది వ్యాధి
సమాధి నుణ్డి శ్రీసాఈ భక్తులను కాపాడేనోయి ॥ 12 ॥
శిరిడీవాసా సాఈప్రభో ॥
మన ప్రశ్నలకు జవాబులు తెలుపును సాఈ చరితములు
వినణ్డి లేక చదవణ్డి సాఈ సత్యము చూడణ్డి
సత్సఙ్గమును చేయణ్డి సాఈ స్వప్నము పొన్దణ్డి
భేద భావమును మానణ్డి సాఈ మన సద్గురువణ్డి ॥ 13 ॥
శిరిడీవాసా సాఈప్రభో ॥
వన్దనమయ్యా పరమేశా ఆపద్బాన్ధవ సాఈశా
మా పాపములూ కడతేర్చు మా మది కోరిక నెరవేర్చు
కరుణామూర్తి ఓ సాఈ కరుణతో మము దరిచేర్చోయీ
మా మనసే నీ మన్దిరము మా పలుకులే నీకు నైవేద్యమ్ ॥ 14 ॥
శిరిడీవాసా సాఈప్రభో ॥
అఖిలాణ్డకోటి బ్రహ్మాణ్డనాయక
రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ
శ్రీసచ్చిదానన్ద సద్గురు సాఈనాథ్ మహరాజ్ కీ జై ॥

Explore More