Lord Shiva

శ్రీ మహాన్యాసమ్ - 3. అఙ్గన్యాసః

(Sri Mahanayasa - 3. Anganyasa in Telugu)

From Yajurveda (Sri Rudram)

Anganyasa is the essential third component of the Sri Mahanayasa, a sacred procedure involving the ritual placement of mantras onto various limbs of the body. By invoking the supreme energy of Lord Shiva through the resonance of the Sri Rudram, this practice purifies the physical frame and prepares the devotee for deeper meditation. It serves as an act of divine fortification, sanctifying the practitioner as a living temple. Regular performance is believed to bestow spiritual protection, mental clarity, and the profound grace of the Rudra, aligning the individual consciousness with the cosmic vibration of the deity.

యా తే॑ రుద్ర శి॒వా త॒నూరఘో॒రా-ఽపా॑పకాశినీ ।
తయా॑ న స్త॒నువా॒ శన్త॑మయా॒ గిరి॑శన్తా॒భి చా॑కశీహి ।
శిఖాయై నమః । 1
అ॒స్మి-న్మ॑హ॒త్య॑ర్ణ॒వే᳚-ఽన్తరి॑క్షే భ॒వా అధి॑ ।
తేషాగ్ం॑ సహస్రయోజ॒నే-ఽవ॒ధన్వా॑ని తన్మసి ।
శిరసే నమః । 2
స॒హస్రా॑ణి సహస్ర॒శో యే రు॒ద్రా అధి॒ భూమ్యా᳚మ్ ।
తేషాగ్ం॑ సహస్ర-యోజ॒నే-ఽవ॒ధన్వా॑ని తన్మసి ।
లలాటాయ నమః । 3
హ॒గ్ం॒స-శ్శు॑చి॒ష-ద్వసు॑రన్తరిక్ష॒సద్ధోతా॑ వేది॒షదతి॑థి-ర్దురోణ॒సత్ ।
నృ॒షద్వ॑ర॒-సదృ॑త॒-సద్వ్యో॑మ॒ సద॒బ్జా గో॒జా ఋ॑త॒జా అ॑ద్రి॒జా ఋ॒త-మ్బృ॒హత్ ।
భ్రువోర్మద్ధ్యాయ నమః । 4
త్ర్య॑బఙ్కం-యఁజామహే సుగ॒న్ధి-మ్పు॑ష్టి॒వర్ధ॑నమ్ ।
ఉ॒ర్వా॒రు॒కమి॑వ॒ బన్ధ॑నాన్
మృ॒త్యో-ర్ము॑క్షీయ॒ మా-ఽమృతా᳚త్ ।
నేత్రాభ్యా-న్నమః । 5
నమ॒-స్స్రుత్యా॑య చ॒ పథ్యా॑య చ॒ నమః॑ కా॒ట్యా॑య చ నీ॒ప్యా॑య చ ।
కర్ణాభ్యా-న్నమః । 6
మా న॑స్తో॒కే తన॑యే॒ మా న॒ ఆయు॑షి॒ మా నో॒ గోషు॒ మా నో॒ అశ్వే॑షు రీరిషః ।
వీ॒రాన్మానో॑ రుద్ర భామి॒తో వ॑ధీర్-హ॒విష్మ॑న్తో॒ నమ॑సా విధేమ తే ।
నాసికాభ్యా-న్నమః । 7
అ॒వ॒తత్య॒ ధను॒స్త్వగ్ం సహ॑స్రాక్ష॒ శతే॑షుధే ।
ని॒శీర్య॑ శ॒ల్యానా॒-మ్ముఖా॑ శి॒వో నః॑ సు॒మనా॑ భవ ।
ముఖాయ నమః । 8
నీల॑గ్రీవా శ్శితి॒కణ్ఠా᳚-శ్శ॒ర్వా అ॒ధః, క్ష॑మాచ॒రాః ।
తేషాగ్ం॑ సహస్రయోజ॒నే-ఽ వ॒ధన్వా॑ని తన్మసి ।
కణ్ఠాయ నమః । 9.1
నీల॑గ్రీవా-శ్శితి॒కణ్ఠా॒ దివగ్ం॑ రు॒ద్రా ఉప॑శ్రితాః ।
తేషాగ్ం॑ సహస్రయోజ॒నే-ఽ వ॒ధన్వా॑ని తన్మసి ।
ఉపకణ్ఠాయ నమః । 9.2
నమ॑స్తే అ॒స్త్వాయు॑ధా॒యా-నా॑తతాయ ధృ॒ష్ణవే᳚ ।
ఉ॒భాభ్యా॑ము॒త తే॒ నమో॑ బా॒హుభ్యా॒-న్తవ॒ ధన్వ॑నే ।
బాహుభ్యా-న్నమః । 10
యా తే॑ హే॒తి-ర్మీ॑ఢుష్టమ॒ హస్తే॑ బ॒భూవ॑ తే॒ ధనుః॑ ।
తయా॒-ఽస్మాన్ వి॒శ్వత॒స్త్వ-మ॑య॒క్ష్మయా॒ పరి॑బ్భుజ ।
ఉపబాహుభ్యా-న్నమః । 11
పరి॑ణో రు॒ద్రస్య॑ హే॒తి-ర్వృ॑ణక్తు॒ పరి॑త్వే॒షస్య॑ దుర్మ॒తిర॑ఘా॒యోః ।
అవ॑ స్థి॒రా మ॒ఘవ॑ద్భ్యః తనుష్వ॒ మీఢ్వ॑స్తో॒కాయ॒ తన॑యాయ మృడయ ।
మణిబన్ధాభ్యా-న్నమః । 12
యే తీ॒ర్థాని॑ ప్ర॒చర॑న్తి సృ॒కావ॑న్తో నిష॒ఙ్గిణః॑ ।
తేషాగ్ం॑ సహస్రయోజ॒నే-ఽ వ॒ధన్వా॑ని తన్మసి ।
హస్తాభ్యా-న్నమః । 13
స॒ద్యో జా॒త-మ్ప్ర॑పద్యా॒మి॒ స॒ద్యో జా॒తాయ॒ వై నమో॒ నమః॑ ।
భ॒వే భ॑వే॒ నాతి॑ భవే భవస్వ॒ మామ్ । భ॒వో-ద్భ॑వాయ॒ నమః॑ ॥
అగుంష్ఠాభ్యా-న్నమః । 14.1
వా॒మ॒దే॒వాయ॒ నమో᳚ జ్యే॒ష్ఠాయ॒ నమః॑ శ్రే॒ష్ఠాయ॒ నమో॑ రు॒ద్రాయ॒ నమః॒ కాలా॑య॒ నమః॒ కల॑వికరణాయ॒ నమో॒ బల॑వికరణాయ॒ నమో॒ బలా॑య॒ నమో॒ బల॑ప్రమథనాయ॒ నమ॒-స్సర్వ॑భూతదమనాయ॒ నమో॑ మ॒నోన్మ॑నాయ॒ నమః॑ ।
తర్జనీభ్యా-న్నమః । 14.2
అ॒ఘోరే᳚భ్యో ఽథ॒ఘోరే᳚భ్యో॒ ఘోర॒ఘోర॑తరేభ్యః ।
సర్వే᳚భ్య-స్సర్వ॒ శర్వే᳚భ్యో॒ నమ॑స్తే అస్తు రు॒ద్ర రూ॑పేభ్యః ॥
మద్ధ్యమాభ్యా-న్నమః । 14.3
తత్పురు॑షాయ వి॒ద్మహే॑ మహాదే॒వాయ॑ ధీమహి ।
తన్నో॑ రుద్రః ప్రచో॒దయా᳚త్ ॥
అనామికాభ్యా-న్నమః । 14.4
ఈశాన-స్సర్వ॑విద్యా॒నా॒-మీశ్వర-స్సర్వ॑భూతా॒నాం॒
రహ్మాధి॑పతి॒-ర్బ్రహ్మ॒ణో ఽధి॑పతి॒-ర్బ్రహ్మా॑ శి॒వో మే॑ అస్తు సదాశి॒వోమ్ ॥
కనిష్ఠికాభ్యా-న్నమః । 14.5
నమో॑ వః కిరి॒కేభ్యో॑ దే॒వానా॒గ్ం॒ హృద॑యేభ్యః ।
హృదయాయ నమః । 15
నమో॑ గ॒ణేభ్యో॑ గ॒ణప॑తిభ్యశ్చ వో॒ నమః॑ ।
పృష్ఠాయ నమః । 16
నమో॒ హిర॑ణ్యబాహవే సేనా॒న్యే॑ ది॒శాఞ్చ॒ పత॑యే॒ నమః॑ ।
పార్​శ్వాభ్యా-న్నమః । 17
విజ్య॒-న్ధనుః॑ కప॒ర్దినో॒ విశ॑ల్యో॒ బాణ॑వాగ్ం ఉ॒త ।
అనే॑శన్న॒స్యేష॑వ ఆ॒భుర॑స్య నిష॒ఙ్గథిః॑ ।
జఠరాయ నమః । 18
హి॒ర॒ణ్య॒గ॒ర్భ స్సమ॑వర్త॒తాగ్రే॑ భూ॒తస్య॑ జా॒తః పతి॒రేక॑ ఆసీత్ ।
సదా॑ధార పృథి॒వీ-న్ద్యాము॒తేమా-ఙ్కస్మై॑ దే॒వాయ॑ హ॒విషా॑ విధేమ ।
నాభ్యై నమః । 19
మీఢు॑ష్టమ॒ శివ॑తమ శి॒వో న॑స్సు॒మనా॑ భవ ।
ప॒ర॒మే వృ॒క్ష ఆయు॑ధ-న్ని॒ధాయ॒ కృత్తిం॒-వఁసా॑న॒ ఆచ॑ర॒ పినా॑క॒-మ్బిభ్ర॒దాగ॑హి ।
కఠ్యై నమః । 20
యే భూ॒తానా॒-మధి॑పతయో విశి॒ఖాసః॑ కప॒ర్ది॑నః ।
తేషాగ్ం॑ సహస్రయోజ॒నే ఽవ॒ధన్వా॑ని తన్మసి ।
గుహ్యాయ నమః । 21
యే అన్నే॑షు వి॒విద్ధ్య॑న్తి॒ పాత్రే॑షు॒ పిబ॑తో॒ జనాన్॑ ।
తేషాగ్ం॑ సహస్రయోజ॒నే-ఽ వ॒ధన్వా॑ని తన్మసి ।
అణ్డాభ్యా-న్నమః । 22
స॒ శి॒రా జా॒తవే॑దా అ॒క్షర॑-మ్పర॒మ-మ్ప॒దమ్ ।
వేదా॑నా॒గ్ం॒ శిర॑సి మా॒తా॒ ఆ॒యు॒ష్మన్త॑-ఙ్కరోతు॒ మామ్ ।
అపానాయ నమః । 23
మా నో॑ మ॒హాన్త॑ము॒త మా నో॑ అర్భ॒క-మ్మా న॒ ఉక్ష॑న్తము॒త మా న॑ ఉక్షి॒తమ్ ।
మా నో॑ వధీః పి॒తర॒-మ్మోత మా॒తర॑-మ్ప్రి॒యా మా న॑స్త॒నువో॑ రుద్ర రీరిషః ।
ఊరుభ్యా-న్నమః । 24
ఏ॒ష తే॑ రుద్రభా॒గ-స్తఞ్జు॑షస్వ॒ తేనా॑వ॒సేన॑ ప॒రో
మూజ॑వ॒తో-ఽతీ॒హ్యవ॑తత-ధన్వా॒ పినా॑కహస్తః॒ కృత్తి॑వాసాః ।
జానుభ్యా-న్నమః । 25
స॒గ్ం॒ సృ॒ష్ట॒జిథ్సో॑మ॒పా బా॑హు-శ॒ర్ధ్యూ᳚ర్ధ్వ ధ॑న్వా॒ ప్రతి॑హితా-భి॒రస్తా᳚ ।
బృహ॑స్పతే॒ పరి॑దీయా॒ రథే॑న రక్షో॒హా-ఽమిత్రాగ్ం॑ అప॒బాధ॑మానః ।
జఙ్ఘాభ్యా-న్నమః । 26
విశ్వ॑-మ్భూ॒త-మ్భువ॑న-ఞ్చి॒త్ర-మ్బ॑హు॒ధా జా॒త-ఞ్జాయ॑మాన-ఞ్చ॒ యత్ ।
సర్వో॒ హ్యే॑ష రు॒ద్ర-స్తస్మై॑ రు॒ద్రాయ॒ నమో॑ అస్తు ॥
గుల్ఫాభ్యా-న్నమః । 27
యే ప॒థా-మ్ప॑థి॒రక్ష॑య ఐలబృ॒దా య॒వ్యుధః॑ ।
తేషాగ్ం॑ సహస్రయోజ॒నే ఽవ॒ధన్వా॑ని తన్మసి ।
పాదాభ్యా-న్నమః । 28
అద్ధ్య॑వోచ-దధివ॒క్తా ప్ర॑థ॒మో దైవ్యో॑ భి॒షక్ ।
అహీగ్॑శ్చ॒ సర్వా᳚న్ జ॒భం​యఁ॒-న్థ్సర్వా᳚శ్చ యాతు ధా॒న్యః॑ ।
కవచాయ హుమ్ । 29
నమో॑ బి॒ల్మినే॑ చ కవ॒చినే॑ చ॒
నమః॑ శ్రు॒తాయ॑ చ శ్రుతసే॒నాయ॑ చ ।
ఉపకవచాయ హుమ్ । 30
నమో॑ అస్తు॒ నీల॑గ్రీవాయ సహస్రా॒క్షాయ॑ మీ॒ఢుషే᳚ ।
అథో॒ యే అ॑స్య॒ సత్వా॑నో॒-ఽహ-న్తేభ్యో॑-ఽకర॒న్నమః॑ ।
తృతీయ నేత్రాయ నమః । 31
ప్రము॑ఞ్చ॒ ధన్వ॑న॒స్త్వ-ము॒భయో॒-రార్త్ని॑యో॒ర్జ్యామ్ ।
యాశ్చ॑ తే॒ హస్త॒ ఇష॑వః॒ పరా॒ తా భ॑గవో వప ।
అస్త్రాయ ఫట్ । 32
య ఏ॒తావ॑న్తశ్చ॒ భూయాగ్ం॑సశ్చ॒ దిశో॑ రు॒ద్రా వి॑తస్థి॒రే ।
తేషాగ్ం॑॑ సహస్రయోజ॒నే ఽవ॒ధన్వా॑ని తన్మసి ।
ఇతి దిగ్బన్ధః । 33
-----------ఇతి ప్రథమ న్యాసః------------
(శిఖాది అస్త్రపర్యన్తం ఏకత్రింశదఙ్గన్యాసః దిగ్బన్ధ సహితః ప్రథమః)

Explore More