Goddess Lalita

దేవీ మాహాత్మ్యం మఙ్గల నీరాజణమ్

(Devi Mahatmyam Mangala Nirajanam in Telugu)

Traditional

This devotional hymn is a Mangala Nirajanam dedicated to Goddess Lalita Tripurasundari, the supreme manifestation of the Divine Mother. Written in Telugu, the verses offer ritualistic light offerings to her radiant feet and divine form. It celebrates her as the source of all auspiciousness and the consort of Lord Shiva. Chanting this stotra is believed to invoke the Mother's grace, cleanse the devotee of past karmic burdens, and bestow spiritual prosperity. It serves as a meditative practice to focus on the eternal beauty and power of the Devi, leading to inner peace and divine realization.

శ్రీ చక్ర పురమన్దు స్థిరమైన శ్రీ లలిత పసిడి పాదాలకు నీరాజనం
పరమేశ్వరుని పుణ్యభాగ్యాల రాశీ ఆ సింహమధ్యకు రత్న నీరాజనమ్ ॥
॥ శ్రీ చక్ర పురమన్దు ॥
బఙ్గారు హారాల శిఙ్గారమొలకిఞ్చు అమ్బికా హృదయాన నీరాజనం
శ్రీ గౌరీ శ్రీ మాత శ్రీ మహారాజ్ఞి శ్రీ సింహాసనేశ్వరికి నీరాజనమ్ ॥
కల్పతరువుగ నన్ను కాపాడే కరములకు కనకమ్బురాశులతో నీరాజనం
పాశాఙ్కుశ పుష్ప బాణ చాపధరికి పరమపావనమైన నీరాజనమ్ ॥
॥ శ్రీ చక్ర పురమన్దు ॥
కాన్తి కిరణాలతో కలికి మెడలో మెరిసే కల్యాణ సూత్రముకు నీరాజనం
కాన్తలన్దరి పసుపుకుఙ్కుమలు కాపాడే కాత్యాయనికి నిత్య నీరాజనమ్ ॥
సిరునవ్వులొలికిఞ్చు శ్రీదేవి అధరాన శతకోటి నక్షత్ర నీరాజనం
కలువరేకులవణ్టి కన్నుల తల్లి శ్రీ రాజరాజేశ్వరికి నీరాజనమ్ ॥
॥ శ్రీ చక్ర పురమన్దు ॥
ముదమార మోమున ముచ్చటగా ధరియిఞ్చు కస్తూరి కుఙ్కుమకు నీరాజనం
చన్ద్రవఙ్కను శిరమకుటమ్బులో దాల్చు సౌన్దర్యలహరికి నీరాజనమ్ ॥
శుక్రవారము నాడు శుభములొసగే తల్లి శ్రీ మహాలక్ష్మికి నీరాజనం
శృఙ్గేరి పీఠమున సున్దరాకారిణి శారదా మాతకు నీరాజనమ్ ॥
॥ శ్రీ చక్ర పురమన్దు ॥
ఎల్లలోకాలను చల్లగా పాలిఞ్చు బ్రహ్మాణ్డరూపిణికి నీరాజనం
ముగ్గురమ్మలకు మూలమగు పెద్దమ్మకు ముత్యాలతో నిత్య నీరాజనమ్ ॥
రాధా జీవన రాగ నామ సఙ్కీర్తనగా రఞ్జిల్లు కర్పూర నీరాజనం
జన్మ జన్మల తల్లి జగదీశ్వరీ నీకు భక్త జనులిచ్చేటి నీరాజనమ్ ॥
శ్రీ చక్ర పురమన్దు స్థిరమైన శ్రీ లలిత పసిడి పాదాలకు నీరాజనం
పరమేశ్వరుని పుణ్యభాగ్యాల రాశీ ఆ సింహమధ్యకు రత్న నీరాజనం
సింహమధ్యకు రత్న నీరాజనం
సింహమధ్యకు రత్న నీరాజనం

Explore More