Lord Venkateswara

వేఙ్గామమ్బ గారి మఙ్గల హారతి

(Vengamamba Gari Mangala Harati in Telugu)

Tallapaka Vengamamba

This Mangala Harati was composed by the 18th-century poet-saint Tallapaka Vengamamba, a devout follower of Lord Venkateswara of Tirumala. The composition serves as a ceremonial offering of light and auspicious verses to the divine couple, Lord Venkateswara and Goddess Alamelumanga. By chanting these verses, devotees express their surrender and seek the eternal blessings of the Lord, who is described as the destroyer of the darkness of sins. Regular recitation is believed to foster deep devotion, cleanse the mind, and invoke the grace of the Supreme Being, ensuring spiritual protection and internal peace for the seeker.

శ్రీ పన్నగాద్రి వర శిఖరాగ్రవాసునకు పాపాన్ధకార ఘన భాస్కరునకూ
ఆ పరాత్మునకు నిత్యానపాయినియైన మా పాలి అలమేలుమఙ్గమ్మకూ (1)
జయ మఙ్గలం నిత్య శుభమఙ్గలం జయ మఙ్గలం నిత్య శుభమఙ్గలం
శరణన్న దాసులకు వరమిత్తునని బిరుదు ధరియిఞ్చియున్న పర దైవమునకూ
మరువ వలదీ బిరుదు నిరతమని పతిని ఏమరనీయనలమేలు మఙ్గమ్మకూ (2)
జయ మఙ్గలం నిత్య శుభమఙ్గలం జయ మఙ్గలం నిత్య శుభమఙ్గలం
ఆనన్ద నిలయమన్దనిశమ్బు వసియిఞ్చి దీనులను రక్షిఞ్చు దేవునకునూ
కానుకల నొనగూర్చి ఘనముగా విభుని సన్మానిఞ్చు అలమేలు మఙ్గమ్మకూ (3)
జయ మఙ్గలం నిత్య శుభమఙ్గలం జయ మఙ్గలం నిత్య శుభమఙ్గలం
పరమొసగ నా వన్తు నరులకని వైకుణ్ఠమరచేత చూపు జగదాత్మునకునూ
సిరులొసగ తన వన్తు సిద్ధమని నాయకుని ఉరముపై కొలువున్న శరధిసుతకూ (4)
జయ మఙ్గలం నిత్య శుభమఙ్గలం జయ మఙ్గలం నిత్య శుభమఙ్గలం
తెలివితో ముడుపులిటు తెమ్ము తెమ్మని పరుష నలిగిఞ్చి గైకొనెడి అచ్యుతునకూ
ఎలమి పాకమ్బు జేయిఞ్చి అన్దరకన్న మలయకెపుడొసగె మహామాతకూ (5)
జయ మఙ్గలం నిత్య శుభమఙ్గలం జయ మఙ్గలం నిత్య శుభమఙ్గలం
మరియు చిత్రవిచిత్ర మణ్టపావలులకును తిరువీధులకు దివ్య తీర్థములకూ
పరగ కనగోపుర ప్రాకారతతులకును చిరములైతగు కనక శిఖరములకూ (6)
జయ మఙ్గలం నిత్య శుభమఙ్గలం జయ మఙ్గలం నిత్య శుభమఙ్గలం
తరచైన ధర్మసత్రములకును ఫలపుష్ప భరిత శృఙ్గారవన పఙ్క్తులకునూ
మురువొప్పు ఉగ్రాణములకు బొక్కసములకు సరసమ్బులగు పాకశాలలకునూ (7)
జయ మఙ్గలం నిత్య శుభమఙ్గలం జయ మఙ్గలం నిత్య శుభమఙ్గలం
అహి వైరి ముఖ్యవాహనములకు గొడుగులకు రహినొప్పు మకరతోరణములకునూ
బహువిధ ధ్వజములకు పటు వాద్య వితతులకు విహిత సత్కల్యాణ వేదికలకూ (8)
జయ మఙ్గలం నిత్య శుభమఙ్గలం జయ మఙ్గలం నిత్య శుభమఙ్గలం
దర చక్ర ముఖ్య సాధనములకు, మణిమయాభరణ దివ్యామ్బర ప్రతతులకునూ
కరచరణ ముఖ్యాఙ్గ గణ సహితమై శుభకరమైన దివ్య మఙ్గల మూర్తికి (9)
జయ మఙ్గలం నిత్య శుభమఙ్గలం జయ మఙ్గలం నిత్య శుభమఙ్గలం
కలిత సుజ్ఞానాది కల్యాణ గుణములకు, బలమొప్పునమిత ప్రభావమునకునూ
వలగొనిన సకలపరివార దేవతలకును, చెలగి పనులొనరిఞ్చు సేవకులకూ (10)
జయ మఙ్గలం నిత్య శుభమఙ్గలం జయ మఙ్గలం నిత్య శుభమఙ్గలం
అలరగా బ్రహ్మోత్సవాదులై సన్తతము వలనొప్పు నిత్యోత్సవమ్బులకునూ
పొలుపొన్దు విశ్వప్రభుత్వుల్లమ్బునకు నలువొన్దు వర విమానమ్బులకునూ (11)
జయ మఙ్గలం నిత్య శుభమఙ్గలం జయ మఙ్గలం నిత్య శుభమఙ్గలం
అరయ తరిగొణ్డ నరహరియగుచు నన్దరికి వరములొసగే శ్రీనివాసునకునూ
మురియుచును విశ్వతోముఖునిట్లు భరియిఞ్చి సిరుల వెలయుచునుణ్డు శేషాద్రికీ (12)
జయమఙ్గలం నిత్య శుభమఙ్గలం జయమఙ్గలం నిత్య శుభమఙ్గలం
శ్రీ వేఙ్కటేశ్వర శరణం మమ ॥

Explore More